రెడ్ కలర్ డ్రెస్ లతో కుర్రకారులను మత్తెక్కించిన తమన్నా.. ఇప్పుడు చేసి ఏం లాభమంటూ ట్రోల్స్?

తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఏ హీరోయిన్లు కూడా మొదట్లోనే గ్లామర్ షో చేయటానికి ఇష్టపడరు.

ఎందుకంటే కెరీర్ మొదట్లో ఎంత జాగ్రత్త పడితే అంత ముందుకు వెళ్తారు కాబట్టి.

అంతేకాకుండా చాలా వరకు  అడుగుపెట్టిన తొలినాళ్లల్లో గ్లామర్ షో చేయటానికి అంతగా సహకరించరు కొందరు హీరోయిన్లు.కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం కెరీర్ మొదట్లోనే గ్లామర్ షోలతో షాక్ ఇస్తూ ఉంటారు.

ఇక ఈ మధ్య ఇండస్ట్రీలలో దర్శక నిర్మాతలు గ్లామర్ షో ని ఆశిస్తున్నారు.దీంతో ఇప్పుడిప్పుడు అడుగుపెడుతున్న హీరోయిన్లంతా తొలినాళ్లలోనే అందాలను బయటపెడుతున్నారు.

ఒకప్పుడు అడుగుపెట్టిన హీరోయిన్లు మాత్రం కొంతకాలం వరకు గ్లామర్ షో చేయటానికి అంతగా ఆసక్తి చూపించలేదు.దీంతో తోటి హీరోయిన్లను చూసి తప్పదు అన్నట్లుగా తాము కూడా అవకాశాల కోసం గ్లామర్ షో చేయటానికి ముందుకు వచ్చారు.

Advertisement

అందులో ఒకరు తమన్నా అని కూడా చెప్పాలి.

కెరీర్ మొదట్లో తమన్నా ఎలా ఉండేదో అప్పటి ప్రేక్షకులకు బాగా తెలుసు.మిల్కీ బ్యూటీ అయినప్పటికి కూడా కెరీర్ మొదట్లో తను నటించిన సినిమాలలో గ్లామర్ షో చేసినట్లు కనిపించలేదు.కానీ ప్రేక్షకుల, దర్శక నిర్మాతల అభిరుచులు మారడంతో రాను రాను తనలో కూడా మార్పు వచ్చింది.

అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.తన నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా సినిమాలలో అవకాశాలు అందుకుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి.అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.

Advertisement

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.ఒకప్పుడు మామూలు హీరోయిన్గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలం నుండి.నిత్యం ట్రెండును ఫాలో అవుతూ వస్తుంది.

చాలా వరకు డిజైనింగ్ దుస్తువులతో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది.బాగా ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుంది.

నిజానికి ఈ బ్యూటీ తన అందాలను పరిచయం చేశాకే అవకాశాలు ఎక్కువగా వచ్చాయని చెప్పాలి.ఇక స్టార్ హీరోయిన్ రేంజ్ కు వచ్చినప్పటికీ కూడా గ్లామర్ షో చేస్తూనే ఉంది.

అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో పంచుకుంది.అందులో రెడ్ కలర్ ఉన్న వెరైటీ డిజైన్ల డ్రస్సులతో గ్లామర్ షో  చేస్తూ కనిపించింది.

దీంతో ఆ వీడియోని చూసిన తన అభిమానులు ఫీదా అవుతున్నారు.ఇక కొందరు మాత్రం ట్రోల్ చేస్తున్నారు.

ఈ షూట్ ఎప్పుడో చెయ్యాల్సింది ఇప్పుడు చేసి ఏం లాభం అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏదేమైనా కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఒక రేంజ్ లోనే పరుగులు తీస్తుంది అని చెప్పాలి.

తాజా వార్తలు