బిగ్ బాస్ కంటెస్టెంట్ పై సంచలన వాఖ్యలు చేసిన హైపర్ ఆది.. మగాడు కాదు అంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇక హైపర్ ఆది వేసే పంచుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 Hyper Aadi Sensational Comments On Jaswanth Padala In Dhee Show ,hyper Aadi, Jab-TeluguStop.com

షోలో జడ్జిని మొదలుకొని యాంకర్ వరకు ప్రతి ఒక్కరిపై కూడా వరుసగా పంచులు వేస్తూ కడుపుబ్బనవిస్తూ ఉంటాడు.అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కొన్నిసార్లు హైపర్ ఆది హద్దులు దాటి మరి సెటైర్స్ వేస్తుంటాడు.

చాలామంది హైపర్ ఆది స్కిట్ లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉంటాయి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు.అయితే ఈ మధ్యకాలంలో హైపర్ ఆది పంచులు మరింత శృతి మీరాయి.

ఎక్కువగా కాంట్రవర్సీల విషయంలోనే హైపర్ ఆది బాగా హైలైట్ అవుతున్నాడు.అయితే ఇప్పటి వరకు కేవలం జబర్దస్త్ లో మంచి మంచి స్కిట్లు చేస్తూ వచ్చిన హైపర్ ఆది ఈ మధ్యకాలంలో తన స్కిట్లో ఎక్కువగా డబ్బులు మినింగ్ డైలాగ్ లే ఉంటున్నాయి.

ఇకపోతే హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, అలాగే పండుగ ఈవెంట్ లో చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.ఒకవైపు బుల్లితెరపై మెప్పిస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా సినిమాలలో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇటీవల విడుదల అయిన ధమాకా సినిమాలో ఆది కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈటీవీలో ఢీ15 షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.ఇక వారం రాబోతున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఇక ఆ ప్రోమోలో విలేజ్ స్పెషల్గా రాబోతోంది.జెడ్జ్ లు అయిన శేఖర్ మాస్టర్ శ్రద్ధాదాస్ కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.ఈ టైంలో నీకు కంటెంస్టెంట్ లు వారి పర్ఫామెన్స్ లతో అదరగొట్టారు.

ఆ తరువాత హైపర్ ఆది జెస్సి ఇద్దరు కూరగాయలు తీసుకుని ఫన్నీగా ఎంట్రీ ఇచ్చారు.

అప్పుడు హైపర్ ఆది సెట్లో అందర్నీ చూసి ఓహో ఈరోజు వీళ్లంతా ఏదో క్యారెక్టర్ లో వచ్చినట్టు ఉన్నారు అనడంతో వెంటనే శేఖర్ మాస్టర్ మీరేంటి వెనకాల కాయలతో వచ్చాడు అంటూ పంచు వేశారు.తర్వాత జెస్సి ఒక్కొక్క కూరగాయలు చూపిస్తుండగా అప్పుడు ఆది ఒక్కో కూరగాయనీ ఒక్కొక్కరుతో పోలుస్తూ పంచులు వేశాడు.అప్పుడు జెస్సి బెండకాయ నువ్వు తీసి దీని ఇంగ్లీషులో ఏమంటారు అని అడగగా అప్పుడు అది దాన్ని జెస్సీ ఫింగర్ అంటారు అనడంతో అందరూ పక పక నవ్వుకున్నారు.

అంటే ఇండైరెక్టుగా జెస్సీని లేడీ అనేసాడు హైపర్ ఆది.దాంతో హైపర్ ఆది వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు జెస్సి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube