సోలార్ విద్యుత్ పై సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట జిల్లా: సూర్యరశ్మి నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే సోలార్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని శివసాయి మార్కెటింగ్ మేనేజింగ్ డైరెక్టర్ బుద్దా శ్రీనివాస్ గుప్తా అన్నారు.బుధవారం స్థానిక మమత ఇన్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సూర్యాపేటలో ప్రతి ఇంటికి సోలార్ అందించేందుకు రూ.

78 వేల సబ్సిడీ అందిస్తున్నట్లు తెలిపారు.సోలార్ ఏర్పాటుకు రూ.2లక్షల 6వేల అవుతుందని, ప్రభుత్వం అందిచే సబ్సిడీ పోను రూ.లక్ష 30 వేలకు సోలార్ అమర్చడం జరుగుతుందన్నారు.దీని ద్వారా నెలకు రూ.300ల నుంచి 400ల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని,గృహ అవసరాలకు వినియోగించుకోవచ్చని అన్నారు.సోలార్ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంతో పాటు పరిమిత కరెంట్ కాకుండా అపరిమితంగా కరెంట్ ను వాడుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ జి.వి.గుప్తా,బైరు రమేష్, మాశెట్టి భాస్కర్,నక్క రాజు,గోవింద్ రెడ్డి,బైరెడ్డి సత్యనారాయణ,దాసరి సతీష్,కర్నాటి సురేందర్, జె.శ్రీనివాసరావు,సాయి కార్తీక్,సంతోష్,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Take Advantage Of The Subsidy On Solar Power, Advantage , Subsidy ,solar Power,

Latest Suryapet News