స్వచ్ఛ సర్వేక్షన్ పై విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛ సర్వేక్షన్( Swachh Survekshan ) పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వచ్ఛ సర్వేక్షన్ పై వ్యాసరచన ,రంగవల్లి, చిత్రలేకనం పై పోటీలు నిర్వహించారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వర్షాకాలం దృష్ట్యా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు నీటి నిలువ ఉండకుండా చూసుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత,కార్యదర్శి రాజా సులోచన,నాయకులు గుంటి శంకర్, ఉపాధ్యాయులు ఉన్నారు ఉన్నారు.

Swachh Survekshan Awareness Program In Boinapalli,Swachh Survekshan ,Boinapalli,
ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!

Latest Rajanna Sircilla News