సూర్యాపేట జిల్లా:మంత్రిపై ధిక్కార స్వరం వినిపించి,బహుజనవాదం ఎత్తుకొని మేమెందుకు పాలకులం కాకూడదని గర్జించిన యాదవ బిడ్డ వట్టే జానయ్య యాదవ్ నిర్భంధం ప్రయోగించిన మంత్రి కుట్రలను తిప్పికొట్టి అక్రమ కేసుల నుండి న్యాయస్థానాల ద్వారా ఊరట పొంది,50 రోజుల అజ్ఞాతానికి స్వస్తి పలికి, బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ( RS Praveen Kumar )తో కలిసి సోమవారం పోరాటాల పురిటిగడ్డ,తన సొంత అడ్డ సూర్యాపేట గడ్డపై గర్జిస్తూ అడుగు పెట్టాడు.
విషయం తెలుసుకున్న బీఎస్పీ శ్రేణులు,వట్టే అనుచరులు, అభిమానులు జిల్లా నలు మూలాల నుండి తండోపతండాలుగా తరలి వచ్చి,అడుగడుగునా అఖండ స్వాగతం చెబుతూ,నీలి జెండాల రెపరెపలతో నీరాజనాలు పలుకుతూ"జై భీమ్ నినాదాలతో"కళాకారులు, కార్యకర్తలు సైనికుల వలే కదంతొక్కుతూ జిల్లా కేంద్రాన్ని హోరెత్తించారు.
అనంతరం బీఎస్పి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా సమావేశంలోసూర్యాపేట( Suryapet )బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ50 రోజుల పోరాటంలో మా కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు,సూర్యాపేట 70ఏండ్ల చరిత్రలో ఒకే ఒక్కసారి బీసీలు ప్రాతినిధ్యం వహించారు.అగ్రవర్ణాల ఇక్కడ పోటీ చేయకుండా ఎన్నో కుట్రలు చేశారు.ఏ పార్టీ నుండి అగ్రవర్ణ నాయకులు వచ్చినా కడుపులో పెట్టుకొని గెలిపించారు.2014 నుండి సూర్యాపేటకు సంబంధం లేని వ్యక్తి కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేని వ్యక్తిని గెలిపించుకున్న ఘనత సూర్యాపేటది.2018లో ఆయన గెలుపు కోసం నేను చేసిన పాత్ర ఏందో అందరికి తెలుసు.అర్ధరాత్రి గెలుపు కోసం కన్నీరు పెట్టుకున్న చరిత్ర ఆయనది.బీఆర్ఎస్ పార్టీ) BRS party )లో క్రియాశీలకంగా పని చేసిన వారికి చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నది నిజం కాదా?నన్ను,నా భార్యను చైర్మన్ చేస్తామని డబ్బులు తీసుకున్నది నిజం కాదా?తీసుకున్న డబ్బులకు బాధ్యత తీసుకోవాలని అడిగినందుకు నాకు ఈ రోజు ఈగతి పట్టించింది నిజం కాదా?వందలాది కాంట్రాక్టర్ల కడుపుకొట్టి ఒకే వ్యక్తికి కాంట్రాక్టులు ఇచ్చి కోట్లు వెనకేసుకున్నది నిజం కాదా?రోడ్ల అభివృద్ధి ముసుగులో ఎన్ని కోట్లు వెనకేసుకు వచ్చింది?మెడికల్ కాలేజ్ మాస్టర్ ప్లాన్ మార్చి కోట్లు సంపాదించింది నిజం కాదా?కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం రోడ్ల మీద వ్యాపారం చేసుకోకుండా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేశారు.2014 ముందు రూ.200 ఖర్చు పెట్టలేని మంత్రి,నేడు వేల కోట్లు ఎట్లా సంపాదించావో శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నాగారం బంగ్లా చుట్టూ కబ్జా చేసిన భూములు,కలెక్టరేట్ పేరుతో పేద రైతుల నుండి భూములను గుంజుకొని భూముల రేట్లు పెంచలేదా?అసైన్డ్ భూములని మిషన్ భగీరథ పేరుతో పేదల భూములు గుంజుకోలేదా?వందల ఎకరాల భూములున్న ఆసాముల దగ్గర ఎందుకు భూములు గుంజుకోలేదో?ఉద్యమ సమయంలో ఉన్న నాయకులు ఇప్ఫడు ఎక్కడ ఉన్నారో?ప్రమాణానికి సిద్ధం.మున్సిపల్ చైర్ పర్సన్ ఐస్తానని గందురీ ప్రకాష్ తో పాటు చాలా మందిని మోసం చేసింది వాస్తవం కాదా? సంతకాలు మున్సిపల్ చైర్ పర్సన్ వి,కమిషన్లు మంత్రికి,సూర్యాపేట ప్రజల ఇబ్బందులపై పిఏలతో మాట్లాడిన రికార్డులు ఉన్నాయి.సమయం వచ్చినప్పుడు బయట పెడతా,కోటి సుఫారీ ఇచ్చిన వ్యక్తితోనే నాపై తప్పుడు కేసులు పెట్టించాడు,అధికార దుర్వినియోగానికి పాల్పపడుతున్న అధికారులను తీసివేసి మంత్రి అహంకారానికి అడ్డుకట్ట వేయాలన్నారు.
లేనిపక్షంలో కోర్టులను ఆశ్రయించడానికి వెనుకాడబోమని,అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులను తమ వ్యవహారశైలిని మార్చుకోవాలని,బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని పేదలను భయభ్రాంతులకు గురి చేయడం బీఆర్ఎస్ అభ్యర్థులు మానుకోవాలన్నారు.అగ్రకుల నాయకత్వంలో పనిచేసే బహుజనులు ఇప్పటికైనా స్వతహాగా బయటకు రండి,బీసీల ఆత్మగౌరవాన్ని బలి చేయవద్దు,రాబోయేది బహుజన రాజ్యమేనని గుర్తుంచుకోవాలన్నారు.
పత్రికా యాజమాన్యాలు అధికార పార్టీకి బందీలయ్యాయని,అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని,సాధారణ జర్నలిస్టు పక్షాన యాజమాన్యాలు నిలబడాలని విజ్ఞప్తి చేశారు.ఒకే రోజులోనే 74 కేసులు పెట్టించడంతో పాటు,ఆ కేసులను సూర్యాపేట జిల్లా కోర్టులో ఎవరు వాదించోద్దని బార్ కౌన్సిల్ కు హుకుం జారీ చేయడం మంత్రి జగదీష్ రెడ్డి నీచరాజకీయ చరిత్రకు నిదర్శనమన్నారు.
అనంతరం ఆర్ఎస్పీ మాట్లడుతూ సూర్యాపేట నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థిగా,బహుజనుల బిడ్డగా మీ ముందుకు వస్తున్న వట్టి జానయ్య యాదవును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు.మూడు సంవత్సరాలు పని చేసిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కారని అన్నారు.
కిరాయి గుండాలకు మంత్రి జగదీశ్ రెడ్డి ( Jagadish Reddy )సుఫారీ ఇచ్చి,వట్టే జానయ్య, కుటుంబ సభ్యులను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.మంత్రి జగదీశ్ రెడ్డితో వట్టే కుటుంబానికి ప్రాణహాని ఉందని,దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.
వేల కోట్లు అక్రమంగా సంపాదించిన డబ్బులను ఎన్నికల సమయంలో పంచుతూ ప్రభుత్వ పథకాలు రావని ప్రజలను భయపెడుతున్న మంత్రి జగదీశ్ రెడ్డి సరైన గుణపాఠం చెప్పాలన్నారు.ఆత్మగౌరవం కోసమే మా పోరాటమని, దొరల గడిలలో బానిసలుగా ఉంటారా బీఎస్పీలో రాజులుగా ఉంటారో మీదే నిర్ణయమని బహుజనులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో బీసీలకు ఏ పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తుందో అర్దం చేసుకోవాలని,అన్ని అగ్రవర్ణ ఆధిపత్య పార్టీలు బహుజనులకు బిచ్చం వేస్తున్నట్లు ఇన్నిస్తాం, అన్నిస్తామని చులకన చేస్తూ ఉన్నాయని,మన వాటా మనకు దక్కాలంటే తెలంగాణలో బహుజలకి రాజ్యాధికారం రావాలంటే అందరం ఏకమై ఈ పార్టీల భరతం పట్టాలని,తప్పకుండా బహుజన రాజ్యం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy