2018లో సూర్యాపేట నియోజకవర్గ ఓట్ల గణాంకాలు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్, పెన్ పహడ్, ఆత్మకూర్ (ఎస్),చివ్వెంల నాలుగు మండలాలతో కూడిన సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాలను తెలంగాణ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం తెలిసిందే.

రెండుసార్లు 2014,2018 ఎన్నికలో ఇక్కడి నుండి బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విజయం సాధించి ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రిగా కొనసాగుతున్నారు.

కానీ, 2023 సూర్యాపేట ఎన్నికపై అస్పష్టత నెలకొంది.మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని జగదీష్ రెడ్డి, ఎలాగైనా ఓడించి బోణీ కొట్టి పాగా వేయాలని కాంగ్రెస్ అభ్యర్ధి రామిరెడ్డి దామోదర్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి సంకినేని వెంకటేశ్వరరావు, బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ ఈసారి తహతహలాడుతున్నాయి.ఈ నేపథ్యంలో గత 2018 ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ఓట్లు సాధించాయనే గణాంకలపై ఓ లుక్ వేద్దాం.2018లో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,11,037 గాను 1,83,984 ఓట్లు పోలయ్యాయి.సూర్యాపేట టౌన్ లో బీఆర్ఎస్ కు 20,152,కాంగ్రెస్ కు 15399,బీజేపీకి 14183, సూర్యాపేట రూరల్ లో బీఆర్ఎస్ కు13343,కాంగ్రెస్ కు 13829,బీజేపీకి 14183 ఓట్లు పడ్డాయి.

Suryapet Constituency Vote Statistics 2018, Suryapet, Suryapet Constituency , Su

పెన్ పహడ్ మండలంలో బీఆర్ఎస్ కు 10814, కాంగ్రెస్ కు 9624, బీజేపీకి 5248 ఓట్లు రాగా, చివ్వెంల మండలంలో బీఆర్ఎస్ కు 11439,కాంగ్రెస్ కు 11782,బీజేపీకి 6853 ఓట్లు పోల్ అయ్యాయి.ఆత్మకూరు (ఎస్) మండలంలో బీఆర్ఎస్ కు 12202,కాంగ్రెస్ కు 11440,బీజేపీకి 7725 ఓట్లు వచ్చాయి.

ఇక పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ఎస్ కు 700,కాంగ్రెస్ కు 609,బీజేపీకి 784 ఓట్లు నమోదయ్యాయి.మరి ప్రస్తుతం 2023 నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో ఏ పార్టీని ఆదరిస్తారో ? ఎవరికి ఏ మండలంలో ఆధిక్యం లభిస్తుందో తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వేచి చూడాల్సిందే.!.

Advertisement

Latest Suryapet News