జవాన్ల మృతికి సంతాపం! పెళ్లి వేడుకలు రద్దు చేసిన వ్యాపారవేత్త!

జమ్మూకాశ్మీర్లో పుల్వామా హలో శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో మరణించిన సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి దేశవ్యాప్తంగా నివాళి అర్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

అలాగే ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

సెలబ్రిటీ ప్రముఖులు వారి యాక్టివేషన్ కూడా జవాన్ల మృతికి సంతాపంగా పోస్ట్ ఫోన్ చేసుకోవడం జరిగింది.అలాగే జవాన్ల మృతికి సంతాపంగా గుజరాత్లో సూరత్ ప్రాంతానికి చెందిన వజ్రాల వ్యాపారి తన కుమార్తె పెళ్లి వేడుకలను రద్దు చేసుకుని సాధారణంగా పెళ్లి జరిపించారు.

దేవాసి మాణిక్ అనే వజ్రాల వ్యాపారి తన కుమార్తెకు పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు చేశారు.అయితే ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్ల కి సంతాపంగా పెళ్లి వేడుకను రద్దు చేసుకుని సాదాసీదాగా పెళ్ళి జరిపించి వేడుకలు రద్దు చేయడం ద్వారా మిగిలిన పదకొండు లక్షల రూపాయలను జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయంగా ప్రకటించాడు.

మాణిక్ తీసుకున్న నిర్ణయంకి కుటుంబ సభ్యులు, పెళ్లి వేడుకకు హాజరైన బంధువులు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయడం విశేషం.జవాన్ల మృతికి సంతాపంగా వ్యాపారవేత్త చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది.

Advertisement
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

తాజా వార్తలు