స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు తోడ్పాటు : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు అధికారులు సంపూర్ణ తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.

గురువారం తన ఛాంబర్ లో స్వయం సహాయ సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ నూతన ఆలోచనలతో మహిళలు వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందజేయాలని, నూతన వ్యాపారాలు ప్రారంభించేలా మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.స్వయం సహాయ సంఘాలకు బ్యాంకుల ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని, వాటితో వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ప్రగతి సాధించే దిశగా మహిళలకు అవసరమైన శిక్షణ అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలలో ప్రస్తుతం మహిళల స్థితప్రతులపై ముందస్తుగా సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.మహిళలు ప్రస్తుతం చేస్తున్న పని, వారికి ఉన్న నైపుణ్యాలు, వారి ఆసక్తి ప్రకారం వివిధ రంగాల కింద మహిళలను విభజించి వారికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వాలు అందించే పథకాలను వినియోగించుకుని బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటూ నూతన వ్యాపార యూనిట్లు మహిళలు ప్రారంభించే విధంగా చూడాలని కలెక్టర్ తెలిపారు.ప్రస్తుతం ఆన్ లైన్, సోషల్ మీడియా ద్వారా అనేక వ్యాపారాలు విస్తరించే అవకాశం, వివిధ రకాల సర్వీసులు అందించే అవకాశం ఉన్నందున వీటిని సైతం మహిళలు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.

Advertisement

ప్రతి మహిళా సంఘానికి అందించే బ్యాంకు రుణాలు , ప్రభుత్వాలు ఔత్సాహిక వేత్తలకు అందించే సబ్సిడీల గురించి వివరించి వాటిని మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు.అనంతరం ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వ్యాపార అవకాశాలు ఉపాధి మార్గాల సంబంధిత అధికారులకు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆహార పరిశ్రమ , పచ్చల్లు , అగర్బత్తులు, సబ్బుల తయారీ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ బట్ట సంచుల తయారీ, మార్కెట్లో డిమాండ్ ఆధారిత వస్తువులు ఆన్లైన్ విధానం ద్వారా వివిధ రకాల సేవలు సమయం చేయడం మొదలగు వివిధ వ్యాపార అంశాలు ఉపాధి అవకాశాల గురించి అధికారులు వివరించారు.స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ, బ్యాంకు రుణాలను వినియోగిస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకు రుణాలను వినియోగిస్తూ ఆర్థికంగా ఎదగాలని ఆ దిశగా మహిళలను తయారు చేసేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )పి.గౌతమి, రాష్ట్ర మెప్మా కో ఆర్డినేటర్లు పద్మ, ప్రమోద్ కుమార్ , శరత్ , మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అవినాష్, లీడ్ బ్యాంకు మేనేజర్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News