టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Mass Maharaja Ravi Teja ) నిర్మించిన సరికొత్త సినిమా సుందరం మాస్టర్ ( sundarem master ).వైవా హర్ష, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తాజాగానేడు అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ నేపథ్యంలో సుందరం మాస్టర్ ట్విట్టర్ రివ్యూకి సంబంధించిన కొన్ని రివ్యూలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఆ వివరాల్లోకి వెళితే.
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు హర్ష చెముడు.ఆయన్ను ఎక్కువగా వైవా హర్షగానే ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు.
వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో ఎక్కడాలేని క్రేజ్ సంపాదించుకున్నాడు హర్ష చెముడు.అనంతరం సినిమాల్లో చిన్ని చిన్ని పాత్రలు చేస్తూ కమెడియన్‌గా అలరిస్తూ వచ్చాడు.
ఇప్పుడు ఏకంగా హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వైవా హర్ష( Viva Harsha ) హీరోగా చేసిన సినిమా సుందరం మాస్టర్.కాగా ఈ మూవీలో మరో షార్ట్ ఫిల్మ్స్ నటి దివ్య శ్రీపాద హీరోయిన్‌గా చేసింది.ఈ చిత్రానికి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు.ఆర్‌టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్‌పై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు సినిమాను నిర్మించారు.సుందరం మాస్టర్ మూవీ ఫిబ్రవరి 23న అంటే శుక్రవారం విడుదల కానుంది.
అయితే, గురువారం రాత్రి హైదరబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సుల్లో ప్రీమియర్ షోలు( AMB multiplexes ) వేశారు.ఈ నేపథ్యంలో ఆ టాక్ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మానవత్వం గురించి యూనిక్ కాన్సెప్టుతో వచ్చిన సినిమా సుందరం మాస్టర్.మిర్యాలమిట్టలో నడిచే కామెడీ, ఆ సెట్ ఎంతో బాగున్నప్పటికీ సినిమా ప్రభావం అంతంతమాత్రమే.అయితే, సినిమాలోని ఆలోచన కొత్తగా ఉన్నప్పిటీకి హిట్ మార్క్ అందుకోలేదు.మంచి మెస్సెజ్‌తో ఈ వీకెండ్ చూసే సినిమా అని ఒక నెటిజన్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు.ఇంటర్వెల్ ముందు నవ్వించిన సుందరం మాస్టర్… తర్వాత అంతగా కామెడీ చేయలేదని టాక్ వినబడుతోంది.సెకండాఫ్ అంతా ఫిలాసఫీ ఎక్కువ ఉందని, ఆ సన్నివేశాలను సరిగా తీయడంలో ఫెయిల్ అయ్యారని టాక్.
స్టోరీ ఐడియా, కొన్ని సీన్లు బాగున్నప్పటికీ… సినిమాలో సోల్ మిస్ అయ్యిందని కామెంట్లు చేస్తున్నారు.మెజారిటీ ప్రేక్షకులు హర్ష చెముడు నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరి, థియేటర్లలో ఎటువంటి టాక్ వస్తుందో చూడాలి.