ఐపీఎల్ లో హిస్టరీలో రికార్డ్ సృష్టించిన సన్ రైజర్స్! బెంగుళూరు బౌలర్స్ ఊచకోత

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎ జట్టు చేయని అత్యధిక పరుగుల రికార్డ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.

ఉప్పల్ వేదికగా బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్స్ గా వచ్చిన డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో వీర విహారం చేసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

దీంతో వికెట్ నష్టపోకుండా 16 ఓవర్స్ లో ఏకంగా 185 పరుగులు చేసారు.ఒక వీళ్ళిద్దరి దాటికి బెంగుళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఏమీ చేయలేక దిక్కులు చూడాల్సి వచ్చింది.

Sun Risers Hyderabad Create Record Highest Score In Ipl Season-ఐపీఎల�

ఈ నేపధ్యంలో కెరియర్ లో వీళ్ళిద్దరూ సెంచురీలు నమోదు చేసారు.ఇక 16వ ఓవర్ తర్వాత బెయిర్ స్టో సెంచురీ చేసి అవుట్ అయిన యూసఫ్ పఠాన్ సహాయంతో వార్నర్ సునామి సృష్టించాడు.

దీంతో నిర్ణీత ఓవర్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 231 పరుగులు చేసింది.ఇక ఐపీఎల్ కెరియర్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం ఒక రికార్డ్ కాగా, మొదటి వికెట్ కి ఏకంగా 185 పరుగుల భాగస్వామ్యం కూడా మరో రికార్డ్ గా నమోదైంది.

Advertisement

ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బెంగుళూరు ఏ మేరకు విజయం అందుకుంటుందో చూడాలి.

ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)
Advertisement

తాజా వార్తలు