గ్రామంలో విద్యార్థులకు నిరుద్యోగుకు అండగా ఉంటా:సామాజిక కార్యకర్త వల్లంల సంతోష్ యాదవ్

నల్లగొండ జిల్లా:చదువుకునే విద్యార్థులకు,ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటానని సామాజిక కార్యకర్త,యువజన నాయకుడు వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు.

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం యరగండ్లపల్లి గ్రామంలో శుక్రవారం ఎస్జీటీ టీచర్ ఉద్యోగాలు సాధించి నియామక పత్రాలు అందుకున్న ఆవంచల దర్శన్,బచ్చనగోని పుష్పలత,వారి తల్లిదండ్రులను సంతోష్ యాదవ్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.గ్రామంలో ఇద్దరు ఎస్జీటీ ఉద్యోగాలను సాధించి గ్రామానికి,తల్లిదండ్రులకు మంచిపేరు తెచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు.

దర్శన్,పుష్పలతను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని గ్రామంలో ఉన్న మిగతా విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యూత్ నాయకులు పాల్గొన్నారు.

ఆ సినిమాలో వైష్ణవి చైతన్యను బ్యాడ్ గా చూపిస్తారట.. అలాంటి బూతులు మాట్లాడుతుందా?
Advertisement

Latest Nalgonda News