ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల కేంద్రం నుండి చాకిరాల గ్రామానికి వెళ్ళే సింగిల్ రోడ్డుపై వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు.

ఎదురుగా వాహనం వస్తే పక్కకు దిగే అవకాశం లేక ప్రమాదాల నడుమ ప్రయాణం చేయాల్సి వస్తుందని,పాఠశాలలకు వెళ్ళే బస్సులు విద్యార్దులతో సర్కాస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుందని,చాకిరాల గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాల్వ దగ్గర నిత్యం ఇదే దృశ్యం కనిపిస్తుందని వాపోతున్నారు.సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జికి ఇరువైపులా 300 మీటర్ల వరకు రోడ్డు ఇరుకుగా ఉండటంతో పాటు మూల మలుపులు ఉండటంతో ఎదురుగా ఏ వాహనం వచ్చినా రోడ్డు క్రిందకు దిగాల్సిందేనని, అలాంటి సమయంలో డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనం నడిపితే విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఎలాంటి పెను ప్రమాదాలు జరగకముందే రోడ్డు వెడల్పు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వాహనదారులు,ప్రజలు కోరుతున్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News