నేరేడుచర్లలో ప్రత్యక్షమైన మనిషిని పోలిన వింతపక్షి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.

దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని, ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాలు, ఆసియా,హిమాలయ,ఇండోనేషియాలో కొన్ని ద్వీపాలలో మాత్రమే కనిపిస్తుందని తెలిపారు.

వింత పక్షి అనారోగ్యం బారినపడి ఎగరలేకుండా ఉందని అక్కడి నుండి తరలించారు.

Latest Suryapet News