కోదాడ కమిషనర్ వింత ప్రవర్తన

సూర్యాపేట జిల్లా:75 వ భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా కోదాడ మున్సిపల్ కమిషనర్ చేసిన అసంబద్ధ ప్రవర్తన పలు విమర్శలకు తావిస్తోందని కాంగ్రేస్ పార్టీ నేత పార సీతయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.కోదాడ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఆయన మాట్లాడుతూ సోమవారం కోదాడ మున్సిపల్ కార్యాలయంలో జెండా వందనాన్ని అపహాస్యం చేస్తూ,అవమానం చేసిన కోదాడ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కోదాడ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించే 75 వ వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవ "జెండా వందన" వేడుకలు ఉదయం గం.8-30 లకు నిర్వహిస్తామని అందర్నీ ఆహ్వానించారన్నారు.ఆహ్వానితులు,ప్రజలు అందరూ హాజరైనా అనుకున్న సమయానికి 2 గంటలు ఆలస్యమైనా కార్యక్రమం ప్రారంభించలేదన్నారు.

విఐపిలు సమయానికి రానంత మాత్రాన నిర్ణీత సమయానికి 30 నిముషాలు దాటిందని కార్యక్రమాన్ని ప్రాభించాలని ఆహ్వానితులు, ప్రజలు చైర్ పర్సన్ ని కోరడం జరిగిందన్నారు.ప్రజాభీష్టం మేరకు కాలాతీతమైందనే సదుద్దేశ్యంతో గాంధీ విగ్రహం ముందు కొబ్బరికాయ కొట్టటానికి చైర్ పర్సన్ ఉపక్రమించారని,కానీ,మున్సిపల్ కమిషనర్ తాను చెప్పే వరకు కార్యక్రమం ప్రారంభం చేయరాదని ఆమెను అడ్డుకోవడంతో దుమారం రేగిందన్నారు.

Strange Behavior Of Kodada Commissioner-కోదాడ కమిషనర్ �

దీనితో కాంగ్రేస్ పార్టీకి చెందిన తాము, ఆహ్వానితులు,ప్రజలు మున్సిపల్ కమిషనర్ బాధ్యరాహిత్యాన్ని ప్రశ్నించామన్నారు.చైర్ పర్సన్ హక్కులు,బాధ్యతల్లో కమిషనర్ తలదూర్చి ప్రజల సమక్షంలో మహిళా చైర్ పర్సన్ ను అవమానపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

కార్యక్రమం ప్రారంభమై వందేమాతర గీతం ముగిసిన వెంటనే చైర్ పర్సన్ ని జెండా ఎగరేయనీయకుండా అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.మున్సిపల్ కమిషనర్ సహనాన్ని కోల్పోయి గతంలో గంటల కొద్దీ ఆలసమైతే అప్పుడేం చేశారు? అప్పుడు చేతకానోళ్ళు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని,ఎప్పుడు చేయాలో చెప్పడానికి అసలు మీరెవరు? అంటూ ఆహ్వానితుల్ని అవమానిస్తూ,కార్యక్రమాన్ని జరగకుండా అడ్డుకోజూశారని అన్నారు.వందల మంది ప్రజలు, ఆహ్వానితుల సమక్షంలో కమిషనర్ చేసిన వింత ప్రవర్తనపై విచారణ చేసి,అతనిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Latest Suryapet News