రాకెట్ యుగంలో రాతి యుగపు ఆలోచనలు...?

సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం వల్లభాపురం గ్రామంలో అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది.

చేపల చెరువు కోసం మాజీ చైర్మన్ తెచ్చిన అప్పు సమస్యగా మారి, ప్రస్తుత చైర్మన్ అప్పు చెల్లించక పోగా చివరికి మాజీ చైర్మన్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన వైనం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన దుస్సా వెంకటేశ్వర్లు గ్రామ చెరువు సంఘం చైర్మన్ గా పని చేసిన సమయంలో చెరువు కోసం కొంత అప్పు చేయగా అతను రెండేళ్ళ క్రితం దిగిపోయేటప్పటికీ ఎనిమిది లక్షలు అప్పు బకాయి ఉంది.రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన కొప్పెర వెంకటేశ్వర్లు కొత్త చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.

అప్పుడు మాజీ చైర్మన్ దుస్సా వెంకటేశ్వర్లు సంఘం అభివృద్ధి కోసం అప్పు తీసుకొచ్చానని, అందులో ఇంకా 8లక్షలు చెల్లించాలని చెప్పి,దానికి సంబంధించిన లెక్కలు కూడా వివరించడంతో ఆ అప్పు తాను తీరుస్తానని ప్రస్తుత చైర్మన్ కొప్పెర వెంకటేశ్వర్లు హామీ ఇస్తూ,40 మంది సంఘం సభ్యుల మధ్య ఒప్పంద పత్రం రాసిచ్చి అధ్యక్ష పదవిని చేపట్టాడు.రెండేళ్లు అవుతున్నా అప్పులు తీర్చడం లేదని మాజీ చైర్మన్ పలుమార్లు విషయాన్ని సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.మొదటి సంవత్సరం చేపలు పట్టగా రూ.13 లక్షలు వచ్చాయి.చెరువుపై తెచ్చిన అప్పు కట్టాలని అడగగా ఈ సారి చెరువుకి సంబంధించిన ఖర్చులు ఉన్నాయని దాటవేసి,వచ్చే ఏడాది చెల్లిస్తానని మాటిచ్చారు.రెండో ఏడాది చేపలు పట్టగా రూ.15 లక్షలు వచ్చాయి.అప్పుడు సంఘంలోని సభ్యులు పదివేల చొప్పున పంచుకుని,అప్పు సంగతి తేల్చకుండా వదిలేశారు.

దీనితో అప్పు తనకు ముప్పుగా మారిందని దుస్సా వెంకటేశ్వర్లు సంఘం సభ్యులను నిలదీశాడు.తన వాటాకు వచ్చిన రూ.10వేలను కూడా తీసుకోలేదు,చేప పిల్లలకు సభ్యత్వ వాటా రూ.2వేలు కూడా ఇవ్వలేదు.ఇది కాస్త మాజీ చైర్మన్,చైర్మన్ మధ్య వివాదంగా మారింది.రూ.2వేలు కట్టలేదని ప్రస్తుత చైర్మన్ కొప్పెర వెంకటేశ్వర్లు మాజీ చైర్మన్ దుస్సా వెంకటేశ్వర్లు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశాడు.ఆ కుటుంబాన్ని ఏ కార్యానికి పిలిచినా రూ.2వేలు జరిమానా విధిస్తామని హుకూం జారీ చేశారు.అయినా వారిని మూడు కుటుంబాలు శుభకార్యాలకు పిలవడంతో వారికి ఒక్కో కుటుంబానికి రూ.2వేలు జరిమానా విధించించారని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు.ఈ విషయాన్ని గ్రామ, మండల నాయకులకు, పోలీసులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.

Advertisement

ఇంకా సమాజంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే మనం ఏ కాలంలో ఉన్నామనే అనుమానం కలుగుతుందని పలువురు విద్యావంతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

షాకింగ్ వీడియో : రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?
Advertisement

Latest Suryapet News