రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు,కరాటే పోటీల పోస్టర్ ను హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నందు బలగం సినిమా డైరెక్టర్ వేణు ఎల్డండి,స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ.

మొదటి రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలను రాజన్న సిరిసిల్లలో ఫిబ్రవరి 16 ఆదివారం రోజున నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం వెంకంపేట లోని సాయికృష్ణ ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతాయని తెలిపారు.

ఈ పోటీలకు ముఖ్య అతిథిగా బలగం సినిమా డైరెక్టర్ ఎల్డండి వేణు హాజరు అవుతారని తెలిపారు.నిర్వహాకులుగా వోడ్నాల శ్రీనివాస్ వ్యవహరిస్తారని అన్నారు.

రాష్ట్ర స్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీలకు వివిధ జిల్లాల నుండి 1000 మంది విద్యార్థిని విద్యార్థులు 50 మంది మాస్టర్లు పాల్గొంటారని ఈ పోటీలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా మాస్టర్ లను కోరారు.ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్, మాస్టర్ అన్నపూర్ణ, మాస్టర్ ప్రవళిక తదితరులు ఉన్నారు.

Advertisement
మైగ్రేన్ త‌ల‌నొప్పికి కార‌ణాలు.. లైట్ తీసుకుంటే రిస్క్ త‌ప్ప‌దు!

Latest Rajanna Sircilla News