క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలతో పోల్చి చూస్తే అన్ని వర్గాల ప్రేక్షకుల మెప్పు పొందిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఖడ్గం సినిమా 2002 సంవత్సరం నవంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలైంది.
ఈ సినిమా రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకుంది.దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కగా శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ లకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
కృష్ణవంశీ ఈ సినిమాతోనే ప్రేక్షకులకు మరింత చేరువయ్యారని చెప్పవచ్చు.కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన రంగమార్తాండ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో కృష్ణవంశీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే తాజాగా ఒక నెటిజన్ మీ నుంచి ఖడ్గం లాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పగా ఇప్పుడు ఖడ్గం లాంటి సినిమాను తీస్తే చంపేస్తారేమో సీన్ అని కృష్ణవంశీ కామెంట్ చేశారు.
ఖడ్గం సినిమాలో పలు వివాదాస్పద అంశాలను కృష్ణవంశీ టచ్ చేయడంతో ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.
కమర్షియల్ ఫార్ములాను పట్టించుకోకుండా సినిమాలను తెరకెక్కించడం వల్లే కృష్ణవంశీకి సక్సెస్ దక్కడం లేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.రంగమార్తాండ సినిమాకు ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా కృష్ణవంశీ ఆ ఆఫర్లను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.
ఈ సినిమాతో కృష్ణవంశీ కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.దర్శకుడు కృష్ణవంశీ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.స్టార్ హీరోలతో కృష్ణవంశీ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణవంశీ పారితోషికం సైతం గతంతో పోలిస్తే బాగా తగ్గిందని సమాచారం అందుతోంది.