పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి:జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణ వేగంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( District Election Office cum Collector S Venkatrao ) సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో పోలింగ్ కేంద్రాల క్రమబద్దీకరణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజక వర్గాల వారీగా వివిధ అంశాలపై సమీక్షించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పేర్ల మార్పు అలాగే పాత పోలింగ్ కేంద్రాల మార్పులపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలన్నారు.

Special Focus On Regularization Of Polling Stations Says District Election Offic

పోలింగ్ కేంద్రాల పరిశీలనకు టీమ్స్ పంపించి వాటి యొక్క స్టితిగతులపై సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని,ఓటర్ సవరణ జాబితా పూర్తి స్థాయిలో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ ఏ.వెంకటరెడ్డి, తహసీల్దార్ వెంకన్న,చకిలం రాజేశ్వరరావు(కాంగ్రెస్),కోట గోపి(సిపిఎం),దేవరశెట్టి సత్యనారాయణ(బీఆర్ఎస్) స్టాలిన్(బీఎస్పీ)ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News