ఆరు గ్యారెంటీల అమలుకై ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రత్యేక కేంద్రాలు

సూర్యాపేట జిల్లా:పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోని ప్రజా పరిషత్ కార్యాలయాల్లో శనివారం ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి లబ్ధిదారుల నుండి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.

గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల కోసం అప్లై చేసుకునేందుకు మీ సేవ,జీరాక్స్ సెంటర్ల చుట్టూ తిరిగి డబ్బుతో పాటు సమయాన్ని వృధా చేసుకున్నా ప్రభుత్వ పథకాలు అందేవి కావని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పాలన ఏర్పాటుతో ఆరు గ్యారెంటీలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ నేపథ్యంలో ప్రజల నుండి గ్రామలో అభయహస్తం పథకం ద్వారా 6 గ్యారంటీలో అమలు చేసేందుకు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందించే ఉద్దేశ్యంతో ప్రజా పాలన కార్యక్రమంలో ఇచ్చిన దరఖాస్తుల్లో అన్ని అర్హతలు ఉండి లబ్ధి చేకూరని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ద్వారా మరో అవకాశం కల్పించింది.

అభయహస్తం 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి, గృహజ్యోతికి సంబంధించి అన్ని అర్హతలు కలిగి ఉండి లబ్ధి చేకూరని లబ్ధిదారుల నుండి ప్రజాపాలన సేవా కేంద్రం నందు లబ్ధిదారుడి యొక్క ఆధార్,రేషన్ కార్డు జిరాక్స్ గతంలో ప్రజా పాలనలో ఇచ్చిన రసీదు మొబైల్ నెంబర్ తో పాటు ప్రభుత్వ పనివేళల్లో ప్రతి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు.గతంలో ప్రజాపాలనలో అప్లై చేయనివారు ఎవరైనా ఉంటే కొత్త దరఖాస్తును కూడా ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తు చేయవచ్చని చెప్తున్నారు.

రాజాపేట తహశీల్దార్‌కు ఆగంతకుడు కుచ్చుటోపి
Advertisement

Latest Suryapet News