గ్రామాల్లో వేసవి నీటి కష్టాలు తీర్చండి...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Nagar ) మండల వ్యాప్తంగా వేసవి నీటి ఎద్దడితో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అల్లాడుతున్నారని సీపీఎం హుజూర్ నగర్ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్,అన్నారు.

మంగళవారం మండల పరిధిలో గోపాలపురం ( Gopalapuram _)గ్రామంలో నెలకొన్న నీటి మరియు ఇతర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

రెండు నెలలుగా బండమీద కాలనీలో వాటర్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో నీటి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని,అనేకసార్లు గ్రామ సర్పంచ్, సెక్రటరీకి తెలిపినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని అవేదన వ్యక్తం చేశారు.9,10 వార్డుల్లో వాటర్ సౌకర్యం లేక( Water problems ) అర కిలోమీటర్ దూరం వెళ్లిమహిళలు బట్టలు ఉతుకొని,నీళ్ళు తెచ్చుకుంటే,కొందరు మినరల్ వాటర్ కొనుగోలు చేసి వాడుకుంటూ, స్నానాలు కూడా చేస్తూ నానా కష్టాలుపడుతున్నారని అన్నారు.తక్షణమే అధికారులు స్పందించి ఆ కాలనీలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలనికోరారు.

Solve Summer Water Problems In Villages...! , Summer , Water Problems , Huzur N

లేనిపక్షంలో కాలనీ ప్రజలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?
Advertisement

Latest Suryapet News