ప్రముఖ బాలీవుడ్ సింగర్ కు కరోనా.....ఆందోళనలో అభిమానులు!

2020 సంవత్సరం లో ప్రపంచ సంగీత ప్రపంచం లో అనుకోని విషాదం చోటుచేసుకున్న విషయం విదితమే.

సినీ విలాకాసం లో గాన గంధర్వుడు గా నిలిచిన ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి అందరినీ కలచివేసింది.

సంగీత ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా చెప్పుకోవాలి.ఇప్పటికే ఆయన మృతి విషాదం నుంచి కోలుకుంటున్న సంగీత ప్రియులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.

Singer Kumar Sanu Tested Corona Positive, Bollywood Singer Sanu, Gunnies Record,

తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ కుమార్ సాను కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.దీనితో ఆయన అభిమానులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులలో ఆందోళన నెలకొంది.

ఈ క్రమంలో ఆయన త్వరగా ఈ మహమ్మారి నుంచి కోలుకోవాలి అంటూ అందరూ ప్రార్ద‌న‌లు కూడా చేస్తున్నారు.బాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా నిలిచిన కుమార్ సాను 1990 లో ఇండస్ట్రీ లో ఎన్నో పాటలు పాడి అలరించారు.

Advertisement

అంతేకాకుండా ఒక్క రోజులోనే 28 పాటలు పాడి గిన్నిస్ రికార్డ్ కూడా నెలకొల్పారు.ఆయన ఇప్పటివరకు మొత్తం 30 భాషల్లో 21 వేల పాటలు పాడిన రికార్డ్ కూడా ఆయన సొంతం.

అంతేకాకుండా బీబీసీ టాప్ 40 బాలీవుడ్ సౌండ్ ట్రాక్స్ లో సాను పాటలు దాదాపు 25 వరకు ఉన్నాయి అంటే ఆయన ఏ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారో అర్ధం అవుతుంది.అలానే ఆయనకు 2009 లో ఆయనకు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను కూడా అందించింది.

అయితే ఆయనకు కరోనా సోకిన విషయాన్ని సాను నే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.‘దురదృష్టవశాత్తు నాకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దయచేసి నా ఆరోగ్యం కుదుటపడాలని దేవుడిని ప్రార్థించండి.థ్యాంక్యూ మై టీమ్‌’ అంటూ ఆయన పోస్ట్‌ చేశారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

ఆయనకుభార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.కుమార్ సాను కుమారుడు ప్రస్తుతం జాన్‌ బిగ్‌బాస్‌ 14లో కంటెస్టెంటుగా ఉండగా, ఆయన భార్య సలోని, కూతుళ్లు షానూన్‌, అన్నాబెల్‌.

Advertisement

అయితే సాను కరోనా బారిన పడడం తో ఆయన త్వరగా ఈ మహమ్మారి నుంచి కోలుకోవాలి అంటూ అందరూ కోరుకుంటున్నారు.

తాజా వార్తలు