మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ

నల్గొండ జిల్లా:డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూ నిర్వాసితులకు శుక్రవారం పునరావాసం ప్యాకేజీ చెక్కులు పంపిణీ చేశారు.

చెక్కుల పంపిణీలో కొందరికి అన్యాయం జరిగిందంటూ శనివారం మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు.

తహశీల్దార్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లకుండా కార్యాలయంలోనే నిలువరించారు.సమాచారం అందుకున్న పోలీసులు తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని నిర్వాసితులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో మర్రిగూడ ఎస్ఐ ఓ మహిళా నిర్వాసితురాలి మీద చెయ్యి చేసుకోవడంతో నిరసనకారులకు ఎస్ఐకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఎస్ఐ వెంకట్ రెడ్డి మహిళలపై చేయి చేసుకోవడం ఏమిటని,తమ కష్టాలు పోలీసులు ఏం తెలుసని బాధిత నిర్వాసితుల పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రేపు వైన్ షాపులు మాంసం దుకాణాలు బంద్
Advertisement

Latest Nalgonda News