మా నాన్న వల్ల అస్సలు ఉపయోగం లేదు అంటున్న శృతి హాసన్

బాలీవుడ్ లో నెపోటిజం గురించి ప్రస్తుతం చర్చ నడుస్తున్న నేపధ్యంలో సౌత్ లో కూడా దీనిపై కొంత మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సౌత్ ఇండస్ట్రీలో హీరోల విషయంలో నెపోటిజం ఎక్కువగా పని చేస్తుంది.

కొత్త హీరోలు అవకాశాలు సొంతం చేసుకోవాలన్న, స్టార్ హీరోల రేంజ్ కి ఎదగాలన్న అంత ఈజీగా అయ్యే పని కాదు.సెలబ్రెటీల కుటుంబాల నుంచి వచ్చే వారికి హీరోలుగా పరిచయం కావడానికంటే ముందు నుంచే సెలబ్రెటీ స్టేటస్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేస్తుంది.

స్టార్ హీరోల పిల్లల సినిమాలు ఏవరేజ్ అయినా కూడా సూపర్ హిట్ అంటూ ప్రచారం చేస్తారు.అదే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని హీరోల సినిమాలు మంచి హిట్ అయినా కూడా ఏవరేజ్ అని ప్రచారం చేస్తారు.

అయితే నెపోటిజం గురించి సౌత్ లో ఎక్కువ మంది మాట్లాడే ధైర్యం చేయరు.అయితే హీరోయిన్స్ విషయంలో సౌత్ లో వారసత్వం పెద్దగా కనిపించదు.

Advertisement

ఒక్క శృతి హాసన్ మాత్రమే తండ్రి కమల్ హాసన్ పేరుతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.అయితే తరువాత ఆమె తండ్రి సపోర్ట్ లేకుండానే హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది.

ఇదిలా ఉంటే బంధుప్రీతి గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ని ప్రశ్నించినపుడు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది.కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నా తండ్రి ఎప్పుడూ కూడా నాకు ఉపయోగపడలేదని శృతి హాసన్ చెప్పింది.

కెరియర్ ఆరంభంలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న అతని నుంచి తనకి సహకారం అందలేదని, ఆయన కూడా ఏమీ చేయలేకపోయారని చెప్పుకొచ్చింది.తాను ఈ రోజు సొంతం చేసుకున్న గుర్తింపుకి నాకు నేనుగా తెచ్చుకున్నది తప్ప తండ్రి కారణంగా వచ్చిన గుర్తింపు ఏమీ లేదని తేల్చేసింది.

వైట్ హెయిర్ తో వర్రీ వద్దు.. ఈ హెర్బల్ ఆయిల్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు