పోలీసు వృత్తిలో బాధ్యతగా పని చేయాలి:ఎస్పీ

సూర్యాపేట జిల్లా:పోలీసు వృత్తిలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని జిల్లా ఎస్పీ ఎస్.రాజేద్రప్రసాద్ అన్నారు.

జిల్లా ఆర్ముడ్ రిజర్వ్ (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ గా విధులు నిర్వహిస్తున్న బి.సైదులు,బి.లింగయ్య,జానికిరాములు హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి పొందిన నేపథ్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసిన ముగ్గురికి ప్రమోషన్ పత్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమోషన్ తో పాటుగా బాధ్యతలు కూడా పెరుగుతాయని,ప్రజలకు విలువైన సేవలు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.సహ ఉద్యోగులతో కలిసిమెలిసి పలిచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఆర్ఐ శ్రీనివాస్,సూపరింటెండెంట్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet

Latest Suryapet News