సబ్ స్టేషన్ లో మరమ్మతులు చేస్తుండగా షాట్ సర్క్యూట్

నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ( Electricity sub station )లో ముకుందాపురం ఫీడర్లో సాంకేతిక లోపం తలెత్తింది.

బుధవారం ముకుందాపురం లైన్ మెన్ ముడి నాగయ్య,అసిస్టెంట్ సాపవత్ అశోక్( Sapawat Ashok ) (తాత్కాలిక ఉద్యోగి) మరమత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా షాట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి పనిచేస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి.

హుటాహుటీన ఇద్దరినీ మిర్యాలగూడ హాస్పిటల్ కు తరలించగా,అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్ తరలించారు.

కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News