కె.విశ్వనాథ్ చనిపోవడానికి ముందు చేసిన ఆఖరి పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన కె.విశ్వనాథ్ మరణ వార్త తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న కె.విశ్వనాథ్ చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.కె.విశ్వనాథ్ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అనే సంగతి తెలిసిందే.టాలీవుడ్ సినీ ప్రముఖులు కె.విశ్వనాథ్ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.

 Shocking Facts About K Vishwanath Details Here Goes Viral In Social Media ,ap Cm-TeluguStop.com

కె.విశ్వనాథ్ సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వ కారణమని ఆయన మరణం విచారానికి గురి చేసిందని ఆయన ఆత్మకు శాంతి కలగాలని బాలయ్య ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.కె.విశ్వనాథ్ మృతి గురించి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విశ్వనాథ్ గారు కాలం చేయడం నన్ను కలచివేసిందని చిరంజీవి పేర్కొన్నారు.ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Ap Cm Ys Jagan, Jr Ntr, Vishwanath, Kamal Haasan, Chiranjeevi, Tollywood-

కళ సజీవమైనదని కె.విశ్వనాథ్ చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుందని కమల్ హాసన్ పేర్కొన్నారు.నేను ఎప్పటికీ ఆయన అభిమానినే అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం వైఎస్ జగన్, జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా కె.విశ్వనాథ్ మృతికి సంతాపం తెలియజేశారు.చనిపోవడానికి కొన్ని గంటల ముందు కె.విశ్వనాథ్ నిన్న శంకరాభరణం మూవీ రిలీజైన రోజు కావడంతో ఒక పాట రాయాలని అనుకున్నారు.

Telugu Ap Cm Ys Jagan, Jr Ntr, Vishwanath, Kamal Haasan, Chiranjeevi, Tollywood-

అయితే తన ఆరోగ్యం సహకరించకపోవడంతో కొడుకును పిలిచి తన పాటకు అక్షర రూపం ఇవ్వాలని ఆయన సూచించారు.ఆ పాటను ఎలాగైనా పూర్తి చేయాలనే ఆలోచనతో పాట చెబుతూనే విశ్వనాథ్ నిద్రలోకి జారుకున్నారని ఎంత పిలిచినా లేవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారని సమాచారం.ఎంతోమంది నటులు కెరీర్ లో సక్సెస్ కావడానికి విశ్వనాథ్ తన వంతు సహాయం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube