జగదీష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన షర్మిల

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న వైఎస్ షర్మిల మహాప్రస్థాన పాదయాత్రలో భాగంగా మంగళవారం చివ్వెంల మండలం మోదింపురం గ్రామానికి చేరుకున్నారు.

గ్రామంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రి జగదీష్ రెడ్డి కనిపిస్తే చెప్పులతో,రాళ్లతో కొట్టండని అన్నారు.

ఇపుడు షర్మిల వ్యాఖ్యలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.వైఎస్సార్ టిపీ అధ్యక్షురాలు షర్మిల ఇంకెమన్నారంటే ఈ నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక మంత్రిగా ఉన్నారు.

ఎమ్మెల్యే స్థాయిలో అభివృద్ధి పనులు చేయడం చేతకాదు అనుకోవచ్చు.ఈయన మంత్రి కదా మంత్రిగా ఏం చేశారని ప్రశ్నించారు.

Advertisement

ఈ మంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్ బోర్డులో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు.జగదీష్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని,ఇప్పుడు కరెంట్ మంత్రిగా ఉండి ప్రజలకు షాక్ కొట్టిస్తున్నారని అన్నారు.13 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంస్థలు బిల్లులు చెల్లించాల్సి ఉందని,ఈ మంత్రికి అవి వసూళ్లు చేయడం చేతకాదని,6 వేల కోట్ల రూపాయల బిల్లులు ప్రజల నెత్తిన మోపి ప్రజల రక్తం పిండుతున్నాడని మండిపడ్డారు.ఈయన ఒక కంత్రి మంత్రి అని, ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే మంత్రికి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు.

జిల్లాలో లిక్కర్ మాఫియా ఈయనదే,ల్యాండ్ మాఫియా ఈయనదే,ప్రభుత్వ భూముల కబ్జాలు ఈయనవే నని ఆరోపించారు.ఈ మంత్రి ఎక్కడైనా కలిస్తే చెప్పులతో కొట్టండని పిలుపునిచ్చారు.అందుకే ఎవరికి ఓటు వేస్తున్నామనేది ఆలోచన చేయండని,ఓటు అనేది తల్లి,చెల్లి లాంటిదని,ఓటును వేసేటప్పుడు అన్నివిధాలా ఆలోచించి వేయాలని సూచించారు.

Advertisement

Latest Suryapet News