హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( HMDA Former Director Shiva Balakrishna ) విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో శివబాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు( ACB Officials ) విచారణను ముమ్మరంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే కస్టడీలో శివ బాలకృష్ణ నుంచి ఏసీబీ కీలక సమాచారం సేకరించిందని తెలుస్తోంది.
అలాగే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేస్తుంది.ఈ క్రమంలోనే శివబాలకృష్ణ సోదరుడు సునీల్ కుమార్ ను ఏసీబీ అధికారులు విచారించారు.జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూరు, పాలకుర్తి, రిమ్మనగూడతో పాటు బీబీ నగర్ సునీల్ దంపతుల పేర్లపై భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.
శివబాలకృష్ణకు సోదరుడు సునీల్ కుమార్ బినామీగా ఉన్నట్లు గుర్తించారు.మరోవైపు శివబాలకృష్ణ ఫోన్ డేటాపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.
.