"బావుందంటే, బాగోదేమో”..."యానిమల్" సినిమాపై డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన పోస్ట్..!!

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్( Ranbir Kapoor ) హీరోగా నటించిన సినిమా “యానిమల్”( Animal ).భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.

 Sensational Post By Director Harish Shankar On The Movie Animal , Director Haris-TeluguStop.com

ఐదు భాషలలో విడుదల కాగా అన్నిచోట్ల కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.రణబీర్ కపూర్ వన్ మ్యాన్ షో మాదిరిగా నటనలో విశ్వరూపం చూపించారు.

తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.

దీంతో చాలామంది సెలబ్రిటీలు సినిమా పట్ల తమ అభిప్రాయాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి ఏకంగా నాలుగు పేజీల రివ్యూ ఇవ్వడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ( Director Harish Shankar )సైతం “యానిమల్” సినిమాపై తనదైన శైలిలో అభిప్రాయం తెలియజేస్తూ సంచలన పోస్ట్ పెట్టారు.

““బావుందంటే, బాగోదేమో”…యానిమల్ చూసిన కొంతమంది అనుకుంటున్న మాటలివి, నచ్చిన వాళ్ళు మాత్రం బావుంది అని అనడం లేదు, బద్దలైపోయింది అంటున్నారు.“సినిమాకు rules ఏం లేవండీ” అని అందరూ అంటుంటారు.అతను మాత్రం అనకుండా Break * .Even though I have concerns about Second Half, I don’t think it would matter now, అస్సలు ఈ వాక్యం రాస్తున్నప్పుడే నేనేనంత  0 naive అనే feeling వస్తుంది, because you can argue with content, but not with success.సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే కంటే సినిమా గురించి చెప్పడానికి ఎవరూ లేరు.

ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళందరూ ఒకటికి రెండుసార్లు చూసారు.అతని పేరు లోనే “వంగా” అని ఉన్నప్పుడు విమర్శలకూ, విశ్లేషణలకూ అతను వంగుతాడనుకోవడం అమాయకత్వం.ఎవరి విషయం ఎలా ఉన్నా, ఎక్కువ length ఉంటే repeat audience రారేమో అన్న నా myth ని సందీప్ తన Interval లో వాడిన gun తో పేల్చేసినందుకు తనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ… ఇంతరాశాక నేను సినిమా… “బాలేదంటే, బాగోదేమో”…హరీష్ శంకర్…” అనీ ట్వీట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube