విద్యార్థి నేత జటంగి సురేష్ పై దేశద్రోహం కేసు...!

సూర్యాపేట జిల్లా: గత కొంతకాలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్న ఓయూ జేఏసీ నేత సురేష్ యాదవ్ మీద పలు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసిన సూర్యాపేట పోలీసులు, సడన్ గా దేశద్రోహం కేసుగా మార్చారు.

పెద్దగట్టు మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు కడారి సతీష్ యాదవ్ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ నందు పెట్టిన కేసుపై తనపై దేశ ద్రోహం కేసు పెట్టడంలో మంత్రి జగదీష్ రెడ్డి హస్తం ఉందని, సూర్యాపేటలో పలు సందర్భాల్లో మంత్రి ఆగడాలు,అరాచకాలు ఎక్కువయ్యాయని వేల కోట్లు ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించడం వల్లనే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేటలోనే బహుజనుల మీద కొంతకాలంగా దాడులు జరుగుతుండటంపై సురేష్ పోరాటం సాగిస్తున్నారు.సురేష్ పోరాటంతో దళిత, బహుజనులు అంతా ఏకమవుతున్నారని, రాబోయే ఎన్నికల్లో మంత్రికి బుద్ధి చెప్పేందుకు సిద్ధం అవుతున్నారని, దీనిని జీర్ణించుకోలేని మంత్రి తన అధికారాన్ని వాడుకొని ఇప్పుడు సడెన్ గా దేశద్రోహం కేసు పెట్టిస్తున్నారని అన్నారు.

Sedition Case Against Student Leader Jatangi Suresh, Sedition Case ,student Lead
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News