భద్రతను పరిశీలించిన జిల్లా సెక్యూరిటీ సిబ్బంది

సూర్యాపేట జిల్లా: గణతంత్ర దినోత్సవం వేడుకలు సందర్బంగా జిల్లా పోలీసు భద్రత చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా హైటెక్ బస్టాండ్,కొత్త బస్టాండ్,ఫ్లై ఓవర్,పాత బస్టాండ్, పరేడ్ గ్రౌండ్ కు వచ్చే రోడ్డు మార్గాలను,పాత భవనాలు,రద్ది ప్రదేశాలు తనిఖీ చేశారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతున్న అతిథులు,అధికారులు, విద్యార్థులు,పౌరులు, ప్రజాప్రతినిధులు రక్షణలో భాగంగా తనిఖీలు నిర్వహించామని సెక్యూరిటీ సిబ్బంది పేర్కొన్నారు.రోడ్ ఓపెనింగ్ సిబ్బంది,డాగ్ స్క్వాడ్ సిబ్బంది,బాంబ్ స్కాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

Security Personnel Of The District Inspected The Security, Security Personnel ,s

Latest Suryapet News