ఆటోనగర్ కోసం ప్రభుత్వ భూముల పరిశీలన...!

సూర్యాపేట జిల్లా:జిల్లా అభివృద్ధిలో భాగంగా ఆటోనగర్( Autonagar ) ఏర్పాటు కోసం అనుకూలమైన ప్రభుత్వ భూములను పరిశీలిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( S Venkata Rao ) అన్నారు.

శనివారం సూర్యాపేట రూరల్ మండలం బాలెంల గ్రామ రెవెన్యూ పరిధిలోని 441 సర్వే నెంబర్ లో, ఇమాంపేటలోని సర్వే నెంబర్ 146 లో,చివ్వెంల మండలం ఐలాపురంలోని సర్వే నెంబర్ 169 లో గలప్రభుత్వ భూములను( Government lands) పరిశీలించి,నీటివనరులు,భూముల అనుకూలత సంబంధిత రెవెన్యూ అధికారుల ద్వారా తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా దినదినాభివృద్ది చెందుతున్న తరుణంలో మరింత వేగంగా పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చేసేలా ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ప్రభుత్వ భూములను పరిశీలన చేస్తున్నట్లు చెప్పారు.

Scrutiny Of Govt Lands For Autonagar , Government Lands , Autonagar , S Venkata

ఆటో నగర్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అందచేయాలని ఆదేశించారు.తదనంతరం మున్సిపల్ ఆధ్వర్యంలో మాలవిసర్జనల ద్వారా తయారు చేసే ఎరువుల కేంద్రాన్ని పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏడి ల్యాండ్ రికార్డ్స్ నాగేందర్, పరిశ్రమల జిఎం తిరుపతయ్య,తహసీల్దార్ వెంకన్న,సర్వేయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు

Latest Suryapet News