ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు కోరుతున్న సర్పంచ్

సూర్యాపేట జిల్లా:బడిబాట కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో సర్పంచ్ నల్లు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కొరకు ప్రత్యేక ఈ కార్యక్రమం నిర్వహించారు.

గానుగుబండ గ్రామస్తులు ఉపాధి హామీ పనులలో ఉండగా వారి దగ్గరకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సదుపాయాలు తెలియజేసి అవగాహన కల్పించి అడ్మిషన్లు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తుంగతుర్తి ఉపాధ్యాయ సిబ్బంది,ఉన్నత,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ

Latest Suryapet News