నా పిల్లలకు ఆ పాటే ఫేవరెట్.. తారక్, చరణ్ సాంగ్ గురించి సమీరారెడ్డి కామెంట్స్ వైరల్!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సమీరా రెడ్డి( Sameera Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తక్కువ సమయంలోనే గ్లామర్ షోతో యువత కళ్ళ ముందు తళుక్కున మెరిసి మాయమైపోయింది.అయితే ప్రస్తుతం ఆమె సినిమాలో నటించకపోయినప్పటికీ ఆమెను మాత్రం ప్రేక్షకులు మరువలేదు.

కాగా తెలుగులో సమీరా రెడ్డి నటించింది మూడు సినిమాలే.కానీ ఇప్పటికీ ఈ బ్యూటీ తెలుగు ఆడియెన్స్ మర్చిపోలేరు.

ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నారు.సోషల్‌ మీడియాలో ఆమెని ఫాలో అవుతూనే ఉన్నారు.

Advertisement

అయితే చాలా రోజుల క్రితమే సినిమాలు మానేసిన సమీరా రెడ్డి ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమవుతుంది.భర్త, పిల్లలు, వారి చదువులకే ప్రియారిటీ ఇస్తుంది.అయితే సమీరా రెడ్డి సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే చాలా రోజుల తర్వాత సమీరారెడ్డి తెలుగు మీడియాతో ముచ్చటించింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో విషయాలను పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి నటించిన గొప్ప అనుభూతినిచ్చింది.వారితో నటించడం నాకంటే మా నాన్న ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.

అది తనకు గర్వంగా ఉందని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

అనంతరం జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను గ్లోబల్ స్థాయిలో గుర్తింపు రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.ఎన్టీఆర్‌ సినిమాల పాటలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ వింటుంటాము అని తెలిపింది.

Advertisement

అలాగే ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్( Naatu Naatu song ) అంటే నాకు బాగా ఇష్టం మా పిల్లలు కూడా ఆ పాటను చాలా ఇష్టపడతారు.వారి ఫేవరెట్ సాంగ్ అదే అని ఆమె తెలిపింది.

ఈ సినిమా పాటను ఇంకా ఇంట్లో పెట్టుకొని మరీ డాన్స్ చేస్తూ ఉంటారు అని తెలిపింది.అలాగే అశోక్ సినిమా( Ashok )లో పాటలు అన్నా కూడా తనకు ఎంతో ఇష్టం అని తెలిపింది.

తాజా వార్తలు