సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం( Sakunthalam ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది.వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత ఇప్పటికే పాల్గొంది.
తీరా సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డ సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు దూరం అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.విజయ్ దేవరకొండ తో కలిసి సమంత ఖుషి( Khushi ) చిత్రం షూటింగ్ లో పాల్గొంటుందట.
వారం రోజుల పాటు చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది.ఖుషి తాజా షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత మళ్లీ శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అయితే అప్పటికే విడుదల తేదీ దగ్గర పడుతుంది.
ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ( lady oriented movie ) అనే విషయం తెల్సిందే.అందుకే సమంత పైనే ప్రమోషన్ భారం అంతా ఉంది.అందుకే ఆమె ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని చిత్ర యూనిట్ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని సమంత మాత్రం ఖుషి సినిమా యొక్క షూటింగ్ ను ఇప్పటికే చాలా ఆలస్యం చేయడం వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.అందుకే ఖుషి సినిమాను వెంటనే పూర్తి చేయాలి అనే ఉద్దేశ్యంతో వెంట వెంటనే డేట్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒక వైపు శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా ఖుషి సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ఓకే చెప్పింది.ఒక వైపు షూట్ లో పాల్గొంటూనే మరో వైపు శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో హాజరు అవుతాను అంటూ ఆమె గుణశేఖర్ టీమ్ తో చెప్పుకొచ్చిందట.
మొత్తానికి శాకుంతలం టీమ్ మెంబర్స్ ను సమంత ఖుషి సినిమా షూట్ లో పాల్గొంటూ కాస్త ఇబ్బంది పెడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.