రన్నింగ్ ట్రైన్ బయటకు వచ్చి రీల్స్ చేసిన యువతి.. పోల్‌ తనకు తగలడంతో..?

సోషల్ మీడియాలో( Social media ) ఫేమస్ కావాలని చాలా మంది రైలు మీద ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తున్నారు.చాలా సందర్భాలలో అవి బెడిసి కొడుతున్నాయి.

వాటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారుతున్నాయి.తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

దాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు.ఈ వీడియోలో ఒక అమ్మాయి వైరల్ రీల్ చేయాలనే తపనలో ప్రాణంతో చెలగాటమాడుతుంది.

రైలు పరుగులు ( Train runs )పెడుతుండగా, ఆ అమ్మాయి రైలు నుంచి బయటకు వచ్చి, రైలు డోర్ హ్యాండిల్స్‌ భాగం పట్టుకుని వేలాడుతూ ఒక వీడియో చేయాలని ప్రయత్నించింది.ఈ సమయంలో రైలు పక్కన ఉన్న ఒక స్తంభానికి అమ్మాయి తల బలంగా గుద్దుకోవడంతో, ఆమె స్పృహ తప్పిపోయే స్థితికి చేరుకుంది.

Advertisement

అది ఫేటల్ హిట్ లా కనిపించింది.ఆమె తలకు పోల్‌ చాలా బలంగా తగలానే ఒక బొమ్మలాగా తను బిగుసుకుపోయింది.

అంత బలంగా గుద్దుకున్నా, ఆ అమ్మాయి ఏదోలా ట్రైన్ అలాగే పట్టుకుని ఉండగలిగింది.లేదంటే, ప్రాణం పోయి ఉండేది.ఈ వీడియో అంతటితో ఆగిపోయింది.

ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏమైందో మనకు తెలియదు.అంటే, ఆమె బతికిందా లేదా అనేది తెలియ రాలేదు.

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపనలో ఎంత ప్రమాదం ఉందో ఈ వీడియో చూపిస్తోంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
చైనాలో దారుణం : పెంపుడు కుక్కను తినేసిన హైవే కార్మికులు.. యజమాని గుండె పగిలింది!

ఒక అద్భుతమైన ఫోటో తీయాలనే తపనలో, చాలా మంది యువత ప్రమాదాల గురించి ఆలోచించకుండా, ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్నారు.ఇలాంటి లైఫ్-థ్రెటెనింగ్ స్టంట్స్ చేయడం వల్ల వారికి చాలా తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే తపన కంటే, సురక్షితంగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది.

Advertisement

తాజా వార్తలు