రైతులకు ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేయాలి:సిపిఎం

సూర్యాపేట జిల్లా: రైతులకు ఏకకాలంలో రూ.

లక్ష రుణమాఫీ వెంటనే అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్ల సుదర్శన్,జిల్లా కమిటీ సభ్యుడు బుర్ర శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాహాసిల్దార్ ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అధికారంలోకి వస్తే విడతల వారిగా నాలుగు సంవత్సరాల కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారని, ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాలు అయినా ఇంతవరకు రుణమాఫీ జరగలేదని, ఇప్పుడు ఎన్నికల కన్నా ముందే ఒకేసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.

Rs 1 Lakh Should Be Waived For Farmers Simultaneously CPM,cpm, Cm Kcr, Raithuban

ధరణిలో ఉన్నటువంటి లోపాలను సవరించి ఒకటి రెండు ఎకరాలు ఉన్న రైతులకు వెంటనే పట్టాలు చేసి రైతుబంధు వర్తింప చేయాలని కోరారు.రైతు పండించిన వడ్లను ప్రభుత్వం ఐకెపిల ద్వారా కొనుగోలు చేసినా ఇంకా కొంతమంది రైతులకు డబ్బులు అందలేదని, మిల్లర్లు ధాన్యం నాణ్యత లేదని,తూకాలలో లోపం ఉన్నదని బస్తాకు నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తగ్గింపు చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్ల ద్వారా ట్రక్ సీట్లు ఇప్పించి,వెంటనే డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.అలాగే నకిలీ విత్తనాలు,నకిలీ ఎరువులు ప్రచారం జరుగుతున్నందున అధికారులు షాపులను తనిఖీలు చేసి నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎనగందుల విష్ణుమూర్తి, ముత్తయ్య,గిరి,ఎల్లయ్య, అంతయ్య,విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News