రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్‌, సస్పెక్ట్‌ షీటర్స్‌కు కౌన్సిలింగ్ నిర్వహించి వారి జీవన విధానంతో పాటు, ప్రస్తుత వారి కుటుంబం స్థితిగతులను గురించి అడిగి తెలుసుకుని, గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలని,శాంతి భద్రతలకు, ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదని, తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతి 6 నెలలకు ఒక్కసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్ చేయడం వలన వారిపై పోలీస్ నిఘా ఉంటుంది.

కాబట్టి వారి కదలికలు, ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకొవడం జరుగుతుంది.బైండొవర్ కాలంలో ఏదైనా నేరం కు పాల్పడినట్లు అయితే జరిమానా తో పాటు గా జైలు శిక్ష కూడా పడడం జరుగుతుంది.

ప్రతి ఒక్కరు సత్ప్రవర్తనతో మెలగాలి, చట్టవిరుద్ధంగా పని చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని, సమాజానికి హాని కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

బంగారు చీర..సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత ఆవిష్కరణ
Advertisement

Latest Rajanna Sircilla News