ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి,12 మందికి తీవ్రగాయాలు

జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి ( Hyderabad Vijayawada Highway )నెత్తురోడింది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ మరణించారు.

పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబద్ తరలించారు.స్థానికులు,పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

Road Accident At Hyderabad Vijayawada Highway ,Hyderabad Vijayawada Highway ,Roa

అర్వపల్లి మండల కేంద్రం 15 మంది ప్రయాణికులతో సూర్యాపేట( Suryapet )కు వస్తున్న ఆటో జిల్లా కేంద్రంలోని అంజనాపురి కాలనీ వద్ద జాతీయ రహదారిపైకి రాగానే వెనుక నుండి వేగంగా వచ్చిన ఎర్టిగా కారు ఆటోను బలంగా ఢీ కొట్టడంతో ముందున్న లారీని ఆటో( Lorry Auto Accident ) బలంగా గుద్దుకుంది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులు బాలెంల గురుకుల పాఠశాల టీచర్ చింతరెడ్డి సరిత (44),లక్ష్మీతండాకు చెందిన లునావత్ రుక్కమ్మ(63),గొలుసు వేదశ్విని(17 నెలలపాప) గా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక జనరల్ హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన కలకొట్ల లావణ్య (26),కంపసాటి మహేష్ (30) ఆటో డ్రైవర్,జీడిమెట్ల సైదులు (45) పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.

శివరాత్రి హైమావతి (12) శివరాత్రి రాములమ్మ(40),బొప్పాని పావని(38) భర్త మంగయ్య(టీచర్) చెరుకుపల్లి సైదమ్మ(36), చెరుకుపల్లి శైలజ (14), చెరుకుపల్లి విజేయందర్ (14),కొమ్ము సువర్ణ (40),గొలుసు సంధ్య (25),గొలుసు మొక్షిత్ (7),కొండేటి సాయిరెడ్డి (27)సూర్యాపేట జనరల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Latest Suryapet News