మరోసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. 4 ఎంపీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మరోసారి ఢిల్లీకి వెళ్లారు.

ఈ మేరకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం జరిగే సీఈసీ సమావేశంలో పాల్గొననున్నారు.

ఇందులో ప్రధానంగా తెలంగాణలో నాలుగు పెండింగ్ స్థానాలపై చర్చించనున్నారు.ఈ క్రమంలో వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ మరియు కరీంనగర్ స్థానాల అభ్యర్థులపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేయనున్నారు.

Revanth Reddy To Delhi Once Again.. Clarity On Candidates For 4 Mp Seats ,cm Re

కాగా ఇప్పటికే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య( Kadiyam Kavya ) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది.హైదరాబాద్ నుంచి షెహనాజ్ పేరు పరిశీలనలో ఉండగా.కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మరోవైపు ఖమ్మం ఎంపీ టికెట్ కోసం ముగ్గురు మంత్రులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఖమ్మంలో బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ యోచిస్తోందని సమాచారం.దీంతో నాలుగు ఎంపీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Revanth Reddy To Delhi Once Again.. Clarity On Candidates For 4 MP Seats ,CM Re
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు