నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెద్దిపేట,బోప్పాపుర్, కోరుట్లపేట,నారాయణ పూర్ ,సర్వాయిపల్లె ఐదు గ్రామాల రైతులు( Farmers ) పండించిన వరి పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని, వరి పంటలు పూర్తిస్థాయిలో పండాలి అంటే ప్రస్తుతం సింగ సముద్రంలో ఉన్న 15 ఫీట్ల నీళ్ళు సరిపోవని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుండి ఎగువ మానేర్ లోకి అక్కడి నుండి సింగ సముద్రం లోకి నీటిని విడుదల చేస్తే పంటలు పండుతాయని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన ప్రజావాణి లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమి( Collector Gautami ) కి సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్( Bala Raju Yadav ) వినతి పత్రం అందజేశారు.

ఒగ్గు బాలరాజు యాదవ్ అందజేసిన వినతి పత్రం స్వీకరించిన అదనపు జిల్లా కలెక్టర్ గౌతమి ఇట్టి సమస్యను పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.

Release The Water And Support The Farmers , Rajanna Sirisilla District , Farmers

Latest Rajanna Sircilla News