563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

నల్లగొండ జిల్లా:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది.563 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.గతంలో విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ తాజాగా ప్రకటన విడుదల చేసింది.2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది.

రెండోసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా హైకోర్టు రద్దు చేసింది.సరైన నిబంధనలను పాటించకపోవడంతో రెండోసారి ప్రిలిమ్స్‌ను రద్దయ్యాయి.

Release Of Group-1 Notification For 563 Posts , Group-1 Notification, Telangana

ఇటీవల మరో 60 గ్రూప్‌-1 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.గత నోటిఫికేషన్‌లో ఇచ్చిన 503 పోస్టులతో పాటు కొత్తగా 60 పోస్టులు కలిపి మొత్తం 563 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

భార్యల అక్రమ సంబంధాలకు.. భర్తలు బలి.. కొద్దిరోజుల్లోనే 12 మంది కాటికి.. అసలేం జరుగుతోంది?
Advertisement

Latest Nalgonda News