నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు: ఆర్డీవో

సూర్యాపేట జిల్లా: నకిలీ విత్తనాలు అమ్మితే పిడీ యాక్ట్ నమోదు చేస్తామని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ హెచ్చరించారు.

శుక్రవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పట్టణ సిఐ రాముతో కలసి ఎరువుల, విత్తనాల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు.

అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ ఎరువుల షాపుల్లో నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేయొద్దని,అలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయన్నారు.రైతులందరికీ సకాలంలో విత్తనాలు అందుతాయని,ఎవరూ ఇబ్బందులు పడొద్దన్నారు.

Registration Of PD Act If Fake Seeds Are Sold RDO, PD Act , Fake Seeds , RDO Su

రైతులు కూడా ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

కానిస్టేబుల్ రాంబాబు మృతి బాధాకరం : ఎస్పీ నరసింహ
Advertisement

Latest Suryapet News