Rashmika Varisu Movie: వరిసు సినిమా ప్రమోషన్లకు దూరంగా రష్మిక... అదే కారణమా?

కిరీక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా నటించే అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె తమిళంలో విజయ్ దళపతి హీరోగా నటించిన వరిసు సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

ఇక ఈ సినిమా వారసుడు పేరుతో తెలుగులో కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం మొత్తం ప్రమోషన్లకు హాజరవుతూ ఉండగా హీరోయిన్ రష్మిక మాత్రం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Reasons Behind Rashmika Away From Varisu Movie Promotions Details, Rashmika , Va
Advertisement
Reasons Behind Rashmika Away From Varisu Movie Promotions Details, Rashmika , Va

ఈ విధంగా రష్మిక వరిసు సినిమా ప్రమోషన్లకు దూరం కావడానికి గల కారణం ప్రస్తుతం ఈమె పుష్ప సినిమా రష్యాలో విడుదలవుతున్న నేపథ్యంలో రష్యాలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే రష్యా పర్యటనలో రష్మిక బిజీగా ఉన్నారు.ఇక ఈమె రష్యా నుంచి ఇండియాకి చేరుకున్న అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిస్తున్నటువంటి మిస్టర్ మజ్ను సినిమా షూటింగ్ తో బిజీ కానున్న నేపథ్యంలో వరిసు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ప్రస్తుతం హాజరు కాలేదని, ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న క్రమంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కావచ్చని సమాచారం.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు