ఎన్టీఆర్ 30, 31 రెండు సినిమాలకు పారితోషికం వద్దంటున్న ఎన్టీఆర్.. కారణం ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలియని వారే లేరు.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకొని స్టార్ హీరోగా ఎదిగాడు.

 Reason Behind Ntr Not Taking Remuneration For Ntr30 And Ntr31 Movies Details,  J-TeluguStop.com

ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదనే చెప్పాలి.బాలనటుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.

మొన్నటి వరకు ఒక స్టార్ హీరో గా మాత్రమే పేరు సంపాదించుకున్నాడు.

కానీ ఇటీవలే జక్కన్న దర్శకత్వంలో విడుదలైన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.

ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు.అంతేకాకుండా మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటించగా ఆయన కూడా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

మొత్తానికి ఈ ఇద్దరు స్టార్ హీరోల జీవితాలు ఆర్ఆర్ఆర్ తో మలుపు తిరిగాయనే చెప్పవచ్చు.ఎందుకంటే వీరికి కేవలం టాలీవుడ్ నుండి కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటివరకు ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఏ సినిమాలో కూడా నటించలేదు.కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత ఈయనకు బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయి.

Telugu Koratala Shiva, Prasanth Neel, Jr Ntr, Kalyan Ram, Ntr, Ram Charan, Telug

పైగా ఈయన కోసం బాలీవుడ్ దర్శకులు కూడా క్యూ కడుతున్నట్లు తెలిసింది.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు సైన్ చేశాడు ఎన్టీఆర్.ఇటీవలే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే జరిగిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా కొరటాల శివ తో రూపొందుతున్న ‘ఎన్టీఆర్ 30’ వ సినిమా మోషన్ పోస్టర్ వీడియో విడుదల చేశారు.ఇక ఈ వీడియో ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా బాగా ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ 31 వ గా మరో సినిమా చేయనున్నాడు.

Telugu Koratala Shiva, Prasanth Neel, Jr Ntr, Kalyan Ram, Ntr, Ram Charan, Telug

ఇక ఈ సినిమా గురించి కూడా ఒక అధికారిక పోస్టర్ విడుదల చేయగా ఆయన అభిమానులు తెగ సంతోషంగా ఫీల్ అయ్యారు.అయితే ఈ రెండు సినిమాలకు ఎన్టీఆర్ పారితోషకంను వద్దని చెప్పినట్లు తెలిసింది.ఎందుకంటే తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ కోసమే ఈ పారితోషికం వద్దన్నాడని తెలుస్తుంది.

ఎన్టీఆర్ తన సినిమాలకు కళ్యాణ్ రామ్ ను పార్ట్నర్ గా చేసుకున్నాడు.ఇక ఎన్టీఆర్ నటించనున్న ఈ రెండు సినిమాల నిర్మాణంలో కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ భాగమైంది.

దీంతో తన అన్నయ్య ప్రొడక్షన్ స్థాయిని పెంచడం కోసం ఎన్టీఆర్ రెమ్యునరేషన్ తీసుకోకుండా బిజినెస్ లో షేర్ చేసుకోవాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తుంది.ఇక ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ విషయం గురించి ఎన్టీఆర్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube