మోతె మండల పరిధిలోని క్వారీపై ఆర్డీవో విచారణ

సూర్యాపేట జిల్లా:మోతె మండలం రాఘవపురం గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ 159,161లలో 2019-2020 సంత్సరంలో ప్రభుత్వం దగ్గర అనుమతి పొందిన క్వారీ ద్వారా రైతులకు తీవ్ర నష్టం జరుగుందని ఇటీవల జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి రాఘవపురం గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు.

కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో క్వారీ లో విచారణ జరిపారు.

విచారణలో భాగంగా క్వారీ పక్క వ్యవసాయ భూముల రైతుల వాంగ్మూలం తీసుకున్నారు.క్వారీ వలన మాకు ఎటువంటి ఇబ్బంది లేవని రైతులు ఆర్డీఓతో చెప్పారని,కేవలం ఫిర్యాదు దారుడు మాత్రమే క్వారీ ద్వారా ఇబ్బంది కలుగుతుందని చెబుతున్నారని,ఈ విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ కి అందిస్తానని ఆర్డీవో తెలిపారు.

RDO Investigation On Quarry Under Mothe Mandal , Mothe Mandal , RDO Investigatio

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంఘమిత్ర,ఆర్ఐలు మన్సూర్ అలీ,నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News