రామప్ప ఆలయానికి అరుదైన గౌరవం..!

మనందరికీ చారిత్రక దేవాలయం అయిన రామప్ప ఆలయం గురించి తెలిసే ఉంటుంది.ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో రామప్ప ఆలయం కూడా ఒకటి.

 Rare Tribute To Ramappa Temple . Telangana's, Ramappa Temple, Unesco's World, He-TeluguStop.com

అప్పట్లో ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు ఈ గుడిని నిర్మించారు.రామప్ప దేవాలయం తెలంగాణ లోని హైదరాబాదు నగరానికి 157 కి.మీ.దూరంలో వరంగల్ పట్టణానికి సుమారు 70 కి.మీ.దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర నిర్మించబడినది.ఈ రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.ఇంతటి ఘన చరిత్ర కలిగిన రామప్ప దేవాలయానికి తాజాగా మరొక ఖ్యాతి దక్కిందనే చెప్పాలి.రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది.

ప్రపంచవ్యాప్తంగా 2020వ సంవత్సరంలో మొత్తం 42 వారసత్వ కట్టడాలను యునెస్కో పరిశీలించగా అందులో మనదేశానికి చెందిన రామప్ప దేవాలయంకు మాత్రమే ఈ ఖ్యాతి దక్కింది.పూర్వికులు కట్టిన వారసత్వ కట్టడాల విశిష్టతల గురించి పరిశీలన చేసే క్రమంలో చైనాలోని ఫ్యూజులో సమావేశమైన ప్రపంచ హెరిటేజ్ కమిటీ రామప్ప దేవాలయంను ఎంపిక చేసారు.8వ శతాబ్ద నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపు రావడానికి ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కో కు నామినేట్ చేసింది.

Telugu Heritage, Pm Modi, Ramappa Temple, Telanganas, Unescos-Latest News - Telu

అందులో మొదటిది రామప్ప ఆలయాన్ని ఇసుకపై నిర్మించడం ఒక గొప్పతనం అయితే, నీటితో తేలియాడే ఇటుకలతో ఆలయ గోపురాన్ని నిర్మించడం మరొక విశిష్టతగా చెప్పవచ్చు.అలాగే ఆలయ నిర్మాణానికి వాడిన రాతి ఈనాటికి రంగును కోల్పోకుండా అలాగే ఉండడం.ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకుని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా గుర్తింపు లభించింది.మన తెలుగు రాష్ట్రాల నుంచి వారసత్వ గుర్తింపు పొందిన మొట్ట మొదటి కట్టడంగా రామప్ప దేవాలయ రికార్డు సృషించినది.

ఇంత గొప్ప చరిత్ర కలిగిన రామప్ప దేవాలయాన్ని మీరు కూడా తప్పకుండా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube