సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాప్ లలో పోలీసు జగిలాలతో ఆకస్మిక తనిఖీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, ప్రభుత్వం నిషేధించిన గంజాయి,మరే ఇతర మత్తు పదార్థాల గురించి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( District SP Akhil Mahajan ) ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న ఉన్న పాన్ షాపులలో,కిరాణా షాప్ లలో మత్తు పదార్థాలను గుర్తించే పోలీస్ జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా సి.

ఐ మాట్లాడుతూ జిల్లాలో జిల్లాలో మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని, జిల్లాలో విన్నూత కార్యక్రమాల ద్వారా ప్రజలకి మత్తు పదార్థాల వల్ల కలుగు ఆనార్ధాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.జిల్లాల్లో కూడా గతంలో సిరిసిల్ల పట్టణ పరిధిలో గాంజా చాకిలెట్లకు సంబంధించిన కేసులు నమోదు కావడం జరిగిందన్నారు.

Random Checks By Police Jawans At Pawn Shops In Sirisilla Town Limits-సిర�

అందువలన పట్టణ పరిధిలో ఉన్న పాన్ షాప్ లలో గంజాయి పదార్థాలను గుర్తించే జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని,జిల్లాలో గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎవరైనా వ్యక్తుల వద్ద , పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, మత్తు పదార్థాలు కలిగి ఉన్నా లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

నూతన బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేది ఎప్పుడు - సిపిఎం పార్టీ డిమాండ్
Advertisement

Latest Rajanna Sircilla News