రాజీవ్ గాంధీ ఆన్ లైన్ క్విజ్ పోటీలు

సూర్యాపేట జిల్లా: హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగా జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ( Rajiv Gandhi Youth ) ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్( Quiz Competitions ) ఉంటుందని,జిల్లాలోని విద్యార్ధులు,యువత ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ( Cheviti Venkanna Yadav )పిలుపునిచ్చారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ బ్రోచర్ విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీలో విజేతలుగా నిలిచిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొదటి మూడు బహుమతులుగా ల్యాప్ టాప్,స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లెట్ తో పాటు, స్మార్ట్ వాచ్,ఇయర్ ప్యాడ్స్ హార్డ్ డ్రైవ్,పవర్ బ్యాంక్ ఉంటాయని,అలాగే ప్రతి నియోజకవర్గంలోని మహిళా టాపర్లకు ఎలక్ట్రిక్ స్కూటీ( Electric Scooty ) ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి అంజాద్ అలీ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగుల వాసు,చెరుకు రాము,జిల్లా కాంగ్రెస్ సేవ దళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత,సీనియర్ కాంగ్రెస్ నాయకులూ ఉబ్బాని రఘుపతి,కోడి శివ,పసుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Latest Suryapet News