కేంద్రంలో మోడీ(Narendra Modi),రాష్ట్రంలో కేడి సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను అంతం చేయడానికి కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేస్తున్న పోరాట స్పూర్తితో కాంగ్రెస్ శ్రేణులు(Congress Leaders),ప్రజలు ఐక్యంగా కదలాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి( TPCC state secretary Patel Ramesh Reddy) అన్నారు.
సూర్యాపేట(Suryapet) నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం కొనసాగిస్తున్న పాదయాత్రలో భాగంగా శనివారం ఆయన చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం, బండమీది చందుపట్ల గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా పాదయాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి అయన మాట్లాడుతూ భూమి కోసం,ప్రజల విముక్తి కోసం పోరాడిన దేవులపల్లి వెంకటేశ్వర్ రావుకి జన్మనిచ్చిన గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.పోరాట యోధుల స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ(Telangana) సెంటిమెంటుతో రెండుసార్లు గెలిపించినా జగదీష్ రెడ్డి ఏనాడైనా ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామాలకు వచ్చాడా అని ప్రశ్నించారు.సూర్యాపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం మా ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పోరాడుతామని, ప్రజలకు ఏలాంటి సమస్య ఉన్నా ముందుంటానని భరోసా ఇచ్చారు.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy